ఆపరేషన్ 500.. వేట మొదలు పెట్టిన భారత సైన్యం..?
భారత్ పాకిస్తాన్ సరిహద్దు లో గత కొన్ని రోజుల నుంచి ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నే ప్రస్తుతం పాకిస్తాన్లో శిక్షణ తీసుకుంటున్న ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టేందుకు సరికొత్త ఆపరేషన్ భారత ఆర్మీ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ 500 అనే పేరుతో ప్రస్తుతం భారత ఆర్మీ ఉగ్రవాదుల ను మట్టుబెట్టేందుకు సరికొత్త ఆపరేషన్ మొదలుపెట్టింది. ఏకంగా పాకిస్థాన్లో వివిధ దశలలో శిక్షణ తీసుకుంటున్న 580 మంది ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టేందుకు ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది భారత ఆర్మీ.
ప్రస్తుతం పాకిస్తాన్ లో శిక్షణ తీసుకుంటున్నటువంటి ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే ముందుగానే భారత కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనే ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లు ఎక్కడ ఉన్నాయి... ఉగ్రవాదులకు ఏ విభాగం తోడుగా నిలుస్తుంది.. అన్న దానిపై ఎంతో సమాచారం సేకరించిన తర్వాత బాంబుల వర్షం కురిపిస్తూ ఎక్కడికక్కడ ఉగ్రవాదులను మట్టుబెడుతుంది భారత ఆర్మీ. ఇప్పటికే భారత ఆపరేషన్లో 350 ఉగ్రవాదులు మరణించారని ఇక మిగిలిన ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టేందుకు భారత సైన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదని విశ్లేషకులు అంచనా వెళుతున్నారు. సరిహద్దులు దాటి మరీ దూసుకుపోయి ఉగ్రవాదులను మట్టుబెడుతుంది భారత ఆర్మీ.