రేవంత్ రెడ్డి ని రీప్లేస్ చేస్తున్న ఆ ఇద్దరు నేతలు..?

P.Nishanth Kumar
రేవంత్ రెడ్డి మంచి నాయకుడే అయినా సరైన పార్టీ లో లేనందున అయన గొప్పతనం ఎవరికీ తెలియట్లేదని అనేవారు రాష్ట్రంలో ఎక్కువయ్యారు.. తొలుత బీజేపీ నుంచి అయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆ తర్వాత టీడీపీ లోకి వెళ్లి ఇప్పుడు కాంగ్రెస్ లో ఎంపీ గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు వచ్చిన దగ్గరినుంచి అయన పరిస్థితి ఒంటరి గా అయిపోయాడని పరిస్థితులు చూస్తే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ లో అంత యాక్టివ్ గా ఎవరు లేకపోయినా రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ని అందరికంటే ఎక్కువ గా విమర్శించడం అంతటా చర్చనీయాంశమైంది.. కేసీఆర్ ని విమర్శించాలంటే అది ఒక్క రేవంత్ రెడ్డి కె సాధ్య అన్నట్లు తయారైంది పరిస్థితి..
అయితే పార్టీ లోఇతర నేతల అండ లేకపోవడంతో రేవంత్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం లేదు.. ప్రస్తుతం హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల హడావుడి జోరుగా ఉంది.. డిసెంబర్ 1 న జరిగే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీ లు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. ఇప్పటికే అధికార పార్టీ నేత, సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలపై అన్ని రకాలుగా సిద్ధం అయ్యాము అని చెప్పడం తో ఇతరపార్టీ ల్లో ఒకరకమైన ఆందోళన మొదలైంది. సమయం కూడా చాలా తక్కువ ఇవ్వడంతో బీజేపీ కూడా ఎన్నికలకు సర్వత్రా సిద్ధమయ్యింది..
అయితే బీజేపీ లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ల వాగ్ధాటి తో ప్రతిపక్షంలో ఏ నేత తమకు సరిరారని చెప్పకనే చెప్తున్నారు.. రేవంత్ రెడ్డిని మించి బీజేపీ నేతలు నోటికి పనిచెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నడూ సాహించని స్థాయిలో వారు చెలరేగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షా వంటి నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో కేసీఆర్ ని ధీటుగా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు. వీరు ఇలా చెలరేగడంతో రేవంత్ రెడ్డి నోరు మూగబోయింది చెప్పొచ్చు. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఆయనకు ఇది చాలా కీలకాంశంగా చెప్పవచ్చు. వీరివల్ల రేవంత్ రెడ్డి ఇమేజ్ కుచించుకుపోయే ప్రమాదం ఉంది. ఒకనాడు కేసీఆర్ కి ప్రత్యామ్నాయం తానేనని భావించిన ఆయనకు భవిష్యత్తులో వీరి వాళ్ళ పెద్ద సమస్యగా మారి తన రాజకీయ భవిష్యత్ పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. మరి దీనికి రేవంత్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: