మూడు దేశాలకు అజిత్ దోవల్.. శత్రు దేశాల్లో వణుకు..?

praveen
ప్రస్తుతం భారత్ దౌత్య పరంగా ఎంతో వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది అన్న విషయం తెలిసిందే. భారత్ చైనా సరిహద్దు లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరోవైపు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం భారత దౌత్య పరంగా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా భారత రక్షణ విభాగంలో  భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలకపాత్ర వహిస్తూ ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలతో ప్రత్యర్థి ధీటుగా సమాధానం చెప్పే విధంగా ముందుకు సాగుతున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్న దౌత్యపరమైన విధానం ప్రపంచ దేశాలను ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 భారత్ వేస్తున్న ప్రతి ముందడుగు కూడా ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక ఇటీవలే ప్రస్తుతం భారత భద్రతా సలహాదారు మూడు దేశాలలో పర్యటించడం కూడా మరింత ఆసక్తిగా మారిపోయింది. శ్రీలంక మాల్దీవులు నేపాల్ దేశాలలో ప్రస్తుతం భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటించడం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఓ వైపు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గల్ఫ్ దేశాలలో పర్యటించడం ఇక ఇప్పుడు భారత రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న అజిత్ ధోవల్ పర్యటించడం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.

 ప్రస్తుతం భారత్ రక్షణ రంగంలో కీలకపాత్ర వహిస్తున్న ఇద్దరు పర్యటిస్తున్నారు అంటే ఏదో కీలక విషయం ఉంటుంది అని ప్రస్తుతం భారత శత్రుదేశాల చర్చించుకుంటున్నాయి. అయితే అజిత్ దోవల్ పర్యటన తర్వాత నేపాల్ అంతకు ముందులా దూకుడు ప్రదర్శించడం లేదు అనే విషయం తెలిసిందే. అదే సమయంలో భారత్ ఆయాదేశాలలో దౌత్యపరమైన సంబంధాలు మెరుగు పరచుకోవడం తోపాటు.. రానున్న రోజుల్లో తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా కీలక ముందడుగు వేసింది అని ప్రస్తుతం విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా శత్రుదేశాల ఉచ్చులో పడి మిత్రదేశాలు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ప్రస్తుతం పర్యటనలు జరుగుతున్నట్లు కూడా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: