స్నేహితుడి గదికి వెళ్లిన యువతి.. తలుపు తెరిచిన యువకుడికి భారీ షాక్..?

praveen
ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఏదో ఒక ఘటన వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఎంతో సంతోషంగా స్నేహితుడి ఇంటికి వెళ్లిన యువతి చివరికి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించడం అందరిని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఇక అప్పటి వరకు సంతోషంగా ఉన్న కూతురు సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.



 హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రవీణ అనే 19 ఏళ్ల యువతి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. కుటుంబంతో కలిసి పాండురంగ నగర్ లో నివాసం ఉంటుంది. అయితే శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రవీణకూ...  శ్రీకాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఇక ఆ తర్వాత శ్రీకాంత్ అనే యువకుడితో పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. అయితే హైదర్గూడా లో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు శ్రీకాంత్. అప్పుడప్పుడు ప్రవీణ శ్రీకాంత్ ను కలిసేందుకు గదికి వెళ్లి వచ్చేది.



 ఈ క్రమంలోనే ఇటీవలే తన స్నేహితుడి ఎంగేజ్మెంట్ ఉంది అంటూ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పిన ప్రవీణ్ శ్రీకాంత్ ను కలిసేందుకు గదికి వెళ్ళింది. శ్రీకాంత్ గదిలో  లేకపోవడంతో ఫోన్ చేయగా తన సొంత ఊర్లో ఉన్నాను అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చి గది తలుపులు తెరిచే సరికి ఒక్కసారిగా షాక్. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ప్రవీణ వేలాడుతూ కనిపించింది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: