రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..?
ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ ఫిట్నెస్ ఫలితాలు సంతృప్తికరంగా లేవు అని ఇటీవలే బిసి అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ కోసం రోహిత్ శర్మ వెళ్లే అవకాశం తక్కువగా ఉంది అని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ గాయం విషయం కాస్త ప్రస్తుతం అంత కథకు ముదిరి వివాదంగా మారుతోంది. ఇప్పటికే బిసిసిఐ రోహిత్ శర్మ ఎంపికపై రాజకీయాలు చేస్తోంది అంటూ విమర్శలు కూడా సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.
అదే సమయంలో రోహిత్ శర్మ గాయం పై గందరగోళం నెలకొందని తనకు కూడా క్లారిటీ లేదు అంటూ ఇటీవల విరాట్ కోహ్లీ స్పందించడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది అయితే తాజాగా ఇటీవల రోహిత్ శర్మ గాయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా స్పందించారు. ఈ సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మధ్య మాటలు లేవు అన్నది కోహ్లీ వ్యాఖ్యలతో తెలుస్తోంది.. ఇద్దరిలో ఎవరో ఒకరు ముందు మాట్లాడి ఉండాల్సింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్ సమయంలో బీసీసీఐ అధికారులైన సెలెక్టర్లు లేదా కోచ్ రవిశాస్త్ర వీరిద్దరిని మాట్లాడేలా చేసి ఉంటే బాగుండేది. ప్రస్తుతం ఎంతో టెక్నాలజీ ఉన్నప్పటికీ బిసిసీఐ మాత్రం ఇంకా వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆశిష్ నెహ్రా.