హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురంలో

Hareesh
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురంలో ఈ రోజు  ధర్మపురి అరవింద్ భాజాపా అభ్యర్థి నర్సింగ్ గౌడ్ తరుపున ప్రసంగిస్తూ తెరాస ప్రభుత్వం అవినీతి లో కూరుకుపోయిందని ఆరోపించారు. వరదల సమయంలో భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భాదితులను పరామర్శించారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు కూడా రాలేదు అని ఎద్దేవా చేశారు. 

ఎల్ ఈ డీ బల్బుల విషయం లో చైనా నుండి 50 రూపాయల కు బల్బులు కొని 1000 రూపాయలు దోచుకున్నారని అలాగే ఎల్ ఈ డి బల్బుల వైరు బిగించి 1500 రూపాయలు ఖర్చు పెట్టి 26000 బిల్లు పెట్టి దోచుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు కేంద్రం 440 కోట్లు ఇచ్చిందని 250 కోట్లు తెరాస కార్యకర్తలు దోచుకున్నరని అన్నారు.ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగా 4 నెలలు ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: