మొదటి కరోనా కేసు చైనాలో కాదు.. భారత్లో.. ప్రపంచం ఆశ్చర్యం..?

praveen
చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనాలో వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రదేశాలను మాత్రమే మహమ్మారి వైరస్ పట్టి పీడిస్తూనే ఉంది  ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కరోనా వైరస్ మాత్రం కంట్రోల్ కాకపోవడం గమనార్హం. రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గిన  దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. అయితే కరోనా వైరస్ గురించి అసలు నిజాలు దాచి ప్రపంచదేశాలకు వ్యాపించేలా చేసిన చైనా పై ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.



 అంతేకాదు ప్రస్తుతం చైనా మాత్రం సరికొత్త వాదనను తెరమీదకు తెచ్చి  ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత కొంత కాలం నుంచి కరోనా వైరస్ కు చైనా కు  అస్సలు సంబంధం లేదు అనే విధంగా వ్యవహరిస్తోంది చైనా. గతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా అంతర్జాతీయ విమానాలు నడిపిన  చైనా ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అన్న  కారణంతో వివిధ దేశాలకు సంబంధించిన విమానాలను నిషేధించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇప్పుడు కరోనా కు అసలు చైనా కు సంబంధమే లేదు అంటూ వాదన వినిపించింది .



 కరోనా వైరస్ భారత్ లేదా బంగ్లాదేశ్ లో పుట్టి ఉండొచ్చు అని ఇటీవలే షాంగై  ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు చెప్పుకొచ్చారు. చైనాలోని ఊహన్  నగరం లో కరోనా నమూనాలను గుర్తించక ముందే 2019 వేసవిలో ఈ మహమ్మారి వైరస్ భారత్ లో ఉద్భవించింది అంటూ సదరు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ చైనాలో పుట్టడానికి ఆస్కారం లేదని దీనికి సంబంధించిన పరిశోధనలు కూడా ఉన్నాయి అంటూ తెలిపారు. భారత్లోనే  మొదట కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అంటూ చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: