గ్రేటర్ యుద్దం: తెరాస సర్కార్ కు భారీ షాక్.. కేసీఆర్ ను ఏకిపారేసిన బామ్మ.. వైరల్

Satvika
హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం గత వారం రోజులుగా వాడి వేడిగా సాగుతుంది.. పలు పార్టీల నేతలు, కార్యకర్తలు తమ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.. ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఉందన్న విషయం తెలిసిందే.. ఇందుకోసం నేతలు కార్యకర్తలు ఉదయం నుంచి రోడ్ల పై తిరుగుతూ, ప్రజలను ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నగరం మొత్తం ఎన్నికల ప్రభావం ఎక్కువగా ఉంది..

అలాగే ఈ పార్టీ గెలుస్తుంది అంటూ మీడియా కూడా జనాలను అడుగుతున్నారు. అయితే వారు నిర్వహించిన చిన్న సర్వే లో టీఆరెఎస్ పార్టీకి చుక్కెదురైంది.. ఎన్నికలు సమయంలో మాత్రమే  నాయకులకు ప్రజల పై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది.. ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలు అప్పుడే గుర్తుకు వస్తాయి అని చాలా మంది ప్రజలు అంటారు. అది నిజమే అని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే అర్థమవుతుంది.. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో టీఆరెఎస్ పార్టీ గెలుపు పై మిశ్రమ స్పందన వస్తుంది.  వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓ ముసలవ్వ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏకిపారేసింది. తమ బస్తీ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికలప్పుడు మాత్రం ఓట్లు వేయమని అడగడానికి వస్తారని, తర్వాత తమ సమస్యలను ఎవరూ పట్టించుకోరని మండిపడింది. డ్రైనేజీ, నీటి సమస్య ఉందని.. మాటలు చెబుతారేతప్ప పనులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామన్నారు.. ఇంతవరకు ఇవ్వలేదని, ఈసారి టీఆర్ఎస్‌కు ఓటు వేసేదిలేదని ఆ ముసలవ్వ స్పష్టం చేశారు.. ఈ వార్తలు ప్రస్తుతం తెరాస సర్కార్ కు భారీ షాక్ ను ఇస్తున్నాయి.. మరో రెండు రోజుల్లో ఎవరు గెలుస్తారో తెలియనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: