రైతుల కష్టాలను చూసి ఫ్రీ గా అన్నం పెడుతున్న డాబా ఎక్కడుందో తెలుసా..!!

Satvika
ఢిల్లీ లో రైతుల ధర్నాలు రోజు రోజుకు ఉద్రక్తంగా మారిన సంగతి తెలిసిందే.. న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. వాళ్ళు న్యాయం కోసం రోడ్లు పట్టుకొని కష్టపడుతున్నారు. అయిన కూడా అధికారులు కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు.పోలీసులు రైతుల పై టియర్ గ్యాస్ ను ప్రయోగించిన కూడా వెన్ను చూపి ముందుకు వెళ్తున్నారు.ఢిల్లీ శివార్లలో 4 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళన దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. లాఠీ దెబ్బలను కూడా లెక్కచేయకుండా వాళ్లు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగించినా, షెల్స్ ప్రయోగించి శరీరాన్ని చిద్రం చేసినా, వాటర్ క్యనాన్లతో నీటిని ప్రయోగించినా.. రైతులు అదరలేదు, బెదరలేదు. ఏం జరిగినా ముందుకు సాగడమే గానీ, వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు..

మొత్తానికి అనుకున్నది సాధించారు.శాంతి యుతంగా నిరసన చేసేందుకు పోలీసుల నుంచి అనుమతి పొందారు.ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ శివార్లలోని మార్తాల్‌లో ఓ దాబా యజమాని తన ఉదారత చాటుకున్నాడు. అన్నం పెట్టే రైతుల‌పై పోలీసులు లాఠీలను ఎక్కుపెట్టారు..అయితే అందరి ఆకలిని తీరుస్తున్న రైతుల ఆకలిని ' ఆమ్రిక్ సుఖ్‌దేవ్’ అనే దాబా యజమాని మాత్రం వాళ్లకు అన్నం పెట్టి ఆక‌లి తీరుస్తున్నాడు..సుమారు రెండు వేల మంది రైతులకు సుఖ్ దేవ్ దాబా ఉచితంగా అన్నం పెట్టింది.

ఈ దేశానికి ఇచ్చిన వారి గురించి మాట్లాడితే.. రైతు కంటే గొప్పవాళ్లు ఎవరుంటారని ఆ దాబా యజమాని ప్రశ్నిస్తున్నారు. ముర్తాల్ వారికి భోజనం కొరతే ఉండదని.. ఎంత మంది రైతులు వచ్చినా కూడా వారందరికీ ఫ్రీగా అన్నం పెడుతానని ఆయన భరోసా ఇస్తున్నారు.ముర్తాల్ దాబాలో రైతులు భోజనం చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియోను ‘యూత్ కాంగ్రెస్’ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. రైతుల కష్టాలను అర్థం చేసుకున్న పంజాబ్‌కు చెందిన ఆ దాబా యజమాని పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: