గ్రేటర్ యుద్ధం : పిచ్చోళ్ళ కి పట్టం కట్టకండి..?
ఈ క్రమంలోనే ప్రచారంలో దూసుకుపోయిన అభ్యర్థులందరూ ప్రస్తుతం.. ప్రచారేతర వ్యూహాలు కూడా అమలు చేస్తూ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎక్కడా ప్రచార హోరు కనిపించక పోయినప్పటికీ... అంతర్గత వ్యూహాలతో మాత్రం అంతా వాతావరణం హాట్హాట్గా మారిపోయింది. అదేసమయంలో ప్రస్తుతం ప్రతిపక్ష బీజేపీ అధికార టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక నిన్న జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి హైదరాబాదులో ప్రచారం నిర్వహించారు.
కాగా నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్ అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి అనే లక్ష్యంతో ప్రస్తుతం బీజేపీ అధికార పార్టీ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసు అని... హైదరాబాద్ అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పిచ్చోళ్ళku ఓట్లు వేసి హైదరాబాద్ వారి చేతిలో పెట్టొద్దు అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. కూలకొడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పిచ్చోళ్ళకు ఓట్లు వేయొద్దు అంటూ సూచించారు.