గ్రేటర్ యుద్ధం : బిజెపికి విషయం లేదు.. నిండా విషమే..?

praveen
జిహెచ్ఎంసి ఎన్నికల కు సంబంధించిన ప్రచారానికి తెరపడింది అన్న విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి ఎన్నికల కు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల అయిన నాటి నుంచి అభ్యర్థులందరూ ఎంతో వ్యూహాత్మకం గా పావులు కదిపారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి లక్ష్యం గా విశ్వప్రయత్నాలు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు తన వద్ద ఉన్న అన్ని రకాల అస్త్రాల ను ఉపయోగించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నే అన్ని పార్టీల మధ్య తీవ్రస్థాయి లో మాటల యుద్ధం కూడా కొనసాగింది.

 అయితే జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి తెరపడింది.  ఇప్పటికీ కూడా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కూడా ఆగడం లేదు. ముఖ్యంగా బీజేపీ నేతలు చేసిన ప్రతి మాటని కూడా తెరమీదికి తెచ్చి అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇటీవలె తెలంగాణ పురపాలక శాఖ మంత్రి.. టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్పందిస్తూ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. ఐటీఐఆర్ను రద్దు చేసిన బిజెపి ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో  ఐటి హబ్ చేస్తామని హామీ ఇస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

 హైదరాబాద్ లో నిజాం సంస్కృతి అంటూ ప్రచారం లో అమిత్ షా అన్నారు అంటూ గుర్తు చేసిన కేటిఆర్... కానీ 1920లో గంగా జమున తెహజీబ్ అని బాపూజీ తెలిపారు అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నిక లో కెసిఆర్ను ఎదుర్కునేందుకు ఢిల్లీ పెద్దలు అందరూ వస్తున్నారని కెసిఆర్ ఒక్కడేనని సింహం ఎప్పుడూ సింగిల్గా వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. అన్ని మతాలు కలిసి ఉంటే చూసి ఓర్వలేక బీజేపీ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు అంటూ ఆయన విమర్శించారు. అయితే బిజెపికి విషయం లేదని నిండా విషం  మాత్రమే ఉంది అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: