గ్రేటర్ యుద్ధం : మీరు వేసే ఓటు.. మోడీ నాయకత్వాన్ని బలపరుస్తుంది..?

praveen
ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యం లో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే.  ఈ క్రమం లోనే ఎట్టి పరిస్థితు ల్లో విజయం సాధించాల నే లక్ష్యం తో నిన్నటి వరకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ఎంతో వ్యూహాత్మకం గా పావులు కదిపారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రస్థాయి లో మాటల యుద్ధం కొన సాగింది. నిన్నటి వరకు అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యం లో ముమ్మర ప్రచారం చేస్తూ ప్రచార రంగం లో దూసుకు పోయారు.

 నిన్న సాయంత్రం 6 గంటల తో గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే మొన్నటివరకు బహిర్గతం గా ప్రచారం నిర్వహించిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా పార్టీల పెద్దలు ప్రస్తుతం అంతర్గతం గా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.  రేపు జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు ఓటర్లు. ఇక ఇప్పటికి కూడా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు.

 మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీ పై సంచలన విమర్శలు గుప్పించారు నిజాంబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్.  గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పాలనను అంతమొందించాలి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు.  ఎన్నికల్లో ఓటర్లు అందరూ బిజెపి పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో  ప్రతి ఒక్క ఓటర్ వేసే ఓటు తెలంగాణలో మోడీ నాయకత్వాన్ని మరింత బలపరుస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.  జిహెచ్ఎంసి ఎన్నికల్లో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి అంటూ ప్రజలందరికీ పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: