రేపటి నుంచి ఏటీఎం కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి..?

praveen
దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తమ కస్టమర్లకు ప్రస్తుతం ఎంతో మెరుగైన సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అతి ఎక్కువ మందికి కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంక్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం అగ్ర స్థానంలో ఉంది. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం రూల్స్ సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దారిలోని నడిచింది మరో ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్. అయితే ఎప్పటికప్పుడు తమ బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్.




 ఇక ఇటీవలే తమ కస్టమర్లకు మరింత మెరుగైన సదుపాయాలు అందించేందుకు ఏటీఎం రూల్స్ సవరిస్తున్నట్లు ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ విషయంలో ఎస్బిఐ దారిలోనే నడిచింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి ఓటిపి ఎంటర్ చేయాలని వెల్లడించింది. డిసెంబరు 1 నుంచి కొత్త రూల్ అమలులోకి వస్తాయి. దీంతో ఎటిఎం నుంచి డబ్బులు తీసుకునే వారు ఖచ్చితంగా వారి మొబైల్ ఫోను వెంట తీసుకు వెళ్ళాలి ఉంటుంది. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలంటే తప్పనిసరిగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.


 రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వచ్చే ఓటిపి ఎంటర్ చేస్తేనే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది లేదంటే అలాంటి అవకాశం ఉండదు. ఇలా ఓటీపీ ఆధారిత క్యాష్ విత్డ్రా రూల్స్ ని కేవలం పది వేలకు పైగా ఉన్న లావాదేవీలకు మాత్రమే వర్తించేలా నిబంధన పెట్టింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8:00 వరకు 10 వేలకు పైగా ఏటీఎం విత్ డ్రా చేసుకోవాలనుకునే వారికి మాత్రమే  ఓటిపి రూల్స్ వర్తిస్తాయి అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కొత్త నిబంధనలను  కస్టమర్లు అందరూ తప్పనిసరిగా గమనించాలి అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: