గ్రేటర్ యుద్ధం : పలుచోట్ల బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ..?
అయితే ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆయా పార్టీల నేతలు ఎలాంటి ప్రచారాలు నిర్వహించకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నగరం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు నగరంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు అన్న విషయం తెలిసిందే .
అయితే జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఆర్.కె.పురం పోలింగ్ బూత్ దగ్గర.. టిఆర్ఎస్ బిజెపి నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం చర్చనీయాంశంగా మారిపోయింది. వోటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటూ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం గొడవ పడ్డారు. ఇక హఫీస్ పేట లో అభ్యర్థి ఫోటో ప్రదర్శించడంపై టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక మరోవైపు టిఆర్ఎస్ ఏజెంట్లు గులాబీ రంగు మాస్కులు ధరించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషనర్ పార్థసారథికి ఫిర్యాదు చేశారు అనే విషయం తెలిసిందే.