వైసీపీ ఎమ్మెల్యేలలో బొత్సపై పెరిగిపోతున్న అసంతృప్తి..?
అయితే ఈ తొమ్మిది సీట్లలో ఆరు బొత్స తన అనుచరగణానికి ఇచ్చారన్నది ఎవరికీ తెలియని విషయం.. చీపురుపల్లి నుంచి బొత్స ఎమ్మెల్యేగా ఉండగా ఆయన సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.ఎస్ కోట నుంచి, నెల్లిమర్ల నుంచి, అయన బంధువులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బొబ్బిలిలో అయన అనుచరుడి ఎమ్మెల్యే. విజయనగరం ఎంపీ బొత్స సన్నిహితుడే ఉన్నాడు.. ఇలా మొత్తం తొమ్మిదికి గాను ఆరు సీట్లు బొత్స వర్గం వారివే..
అయితే ఈ బొత్స వర్గంలో ఇప్పుడు అసంతృప్తి మొదలైందని వార్తలు వస్తున్నాయి.. నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కి బొత్స సోదరుడు లక్ష్మణ రావు కి మధ్య వర్గ విభేదాలు వచ్చినట్లు తెలుస్తుంది.. అప్పల నాయుడు ఏరియా లో లక్ష్మణ రావు హడావుడి ఎక్కువగా ఉండడంతో అప్పల నాయుడు దీన్ని తట్టుకోలేకపోతున్నారట.తనను కాదని ఏ పనీ ఎమ్మెల్యే చేయడానికి వీలులేదని లక్ష్మణ రావు ఆదేశాలు ఇస్తున్నారని అందుకే అప్పల నాయుడు లో అసంతృప్తి మొదలైందట.అక్కడ బడ్డుకొండ గెలుపులో లక్ష్మణ రావు పాత్ర ఉంది కానీ ఎమ్మెల్యేనే కాదంటే ఎలా అని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ ఇద్దరి మధ్యన విభేదాలు ముదిరి పాకన పడ్డాయని అంటున్నారు.