అయ్యప్ప భక్తులకు శుభవార్త.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

praveen
కరోనా  వైరస్ కారణంగా అన్ని ఆలయాలు కూడా మూతపడ్డాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే దేవునికి భక్తునికి మధ్య ఎంతో దూరం పెరిగిపోయింది అయితే ప్రస్తుతం అన్లాక్ మార్గదర్శకాలు లో భాగంగా వివిధ ఆలయాల తెరుచుకోవడం తో దైవ దర్శనం కలుగుతుంది ఎంతో మంది భక్తులకు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులు మాలధారణ చేసి 40 రోజులపాటు నిష్టగా పూజలు చేసి ఆ తర్వాత కేరళ చేరుకొని శబరిమల లో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్షను విరమిస్తుంటారు అన్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ కారణంగా భక్తులకు అనుమతి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది శబరిమల పుణ్యక్షేత్రం నిర్వాహకులు.




 దీంతో అయ్యప్ప భక్తులు అందరూ ఎంతో నిరాశ చెందారు. ఇక ఈ ఏడాది అయ్యప్ప దర్శనం దొరుకుతుందో లేదో అని బాధపడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల పుణ్యక్షేత్రం శబరిమల కు భక్తులను అనుమతించే విషయంపై ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. ఇక ఇటీవల కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సాధారణ రోజుల్లో రోజుకు రెండు వేల మంది భక్తులకు శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇక శని ఆదివారాల్లో మూడు వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తూ అనుమతిచ్చింది కేరళ ప్రభుత్వం.



 అయితే రానున్న రోజుల్లో పరిస్థితులను బట్టి శబరిమల ఆలయంలోకి మరింత మంది భక్తులను అనుమతించేందుకు  నిర్ణయం తీసుకున్నాము అంటూ కేరళ దేవాదాయ శాఖ మంత్రి తెలిపారు. ఇక కేరళకు సంబంధించిన టికెట్ బుకింగ్ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుందని.. అయితే అనుమతి అంతకంతకూ పెంచుతూ నేపథ్యంలో కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆరోగ్య శాఖ కూడా తీవ్ర చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది, శబరిమల బేస్ క్యాంపు శిబిరాల వద్ద యాంటిజెన్ పరీక్షలకు ముమ్మరం చేసింది కేరళ ఆరోగ్య శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: