తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!

NAGARJUNA NAKKA
తెలంగాణలో మళ్ళీ.. వరుసగా ఎన్నికల హడావుడి మొదలు కాబోతుంది. కార్పొరేషన్ ఎలక్షన్స్‌ మొదలుకొని.. ఎమ్మెల్సీ ఎన్నికల దాకా పొలిటికల్ వార్ మొదలు కాబోతోంది. దీంతో రాజకీయ పార్టీలు మళ్ళీ ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాయి.
గ్రేటర్ ఎన్నికల తర్వాత ఇక తెలంగాణలో.. ఇప్పట్లో రాజకీయ పంచాయతీలు ఉండవనుకున్నారంతా. కానీ వరుస ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఓటరు నమోదు పూర్తయ్యింది. నోటిఫికేషన్ రావడమే తరువాయి.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు కూడా రాబోతున్నాయి.
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూయడంతో.. నాగార్జున్‌సాగర్‌లో ఆరు నెలల లోపు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన ఈ నియోజకవర్గంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై గెలిచారు నర్సింహయ్య. నోముల అకాల మరణంతో.. ఇప్పుడక్కడ కూడా ఎన్నికలు తప్పనిసరి కాకనున్నాయి. దుబ్బాక ఫలితం చూశాక.. అధికార టీఆర్ఎస్‌ పార్టీ నాగార్జున సాగర్ లో ఎలాంటి ఎత్తుగడ ను అవలంభిస్తుందనేది చూడాలి.
అధికార పార్టీ ఆలోచన ఎలా ఉన్నా.. నాగార్జున్‌ సాగర్ స్థానం ఉప ఎన్నికపై ప్రతిపక్ష కాంగ్రెస్ లో చర్చ మొదలైంది. ఈ ఉప ఎన్నిక జానారెడ్డికి పరీక్ష కానుందనే టాక్‌ మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితిలో.. బరిలో నిలిచేందుకుఉ జానారెడ్డి అందుకు సిద్ధంగా ఉన్నారా..? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గం జానారెడ్డి కుటుంబానికి కంచుకోట. దుబ్బాకనో లేక మరో అసెంబ్లీ నియోజకవర్గమో అన్నట్టుగా పరిస్థితి ఉండదు. రాజకీయంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లిన జానారెడ్డి.. ఈనెల 7న తిరిగి రానున్నారు. అప్పుడే పోటీ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎత్తుగడలు ఎలా ఉన్నా.. బీజేపీ ఏం చేయబోతోందన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అనుకుకన్న స్థాయిలో బలంగా లేకున్నా.. కమళదళం ఏదైనా వ్యూహం పన్నుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: