చంద్రబాబు, పవన్ లు మోడీ ని చూస్తే ఎందుకు తడుపుకుంటున్నారు..?
అయితే ఇది జగన్ చేతకాని తనం అనుకుంటే మీరు టీడీపీ లో కాలేసినట్లే.. ఎందుకంటే జగన్ ప్రజాస్వామ్యానికి లోబడి రాజకీయనాయకుల విమర్శించే , ప్రశ్నించే హక్కు అందరికి ఉందని భావిస్తారు. అందుకే ఆయనను ఎవరు విమర్శించినా పట్టించుకోరు. ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే చూస్తారు. ఏవైనా విపత్తు వస్తే వారికీ సహాయం అందిందా లేదా అనేదే చూస్తారు.. అయితే జగన్ విమర్శించే విషయంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయడం ఏపీ లో ప్రధాన ప్రతిపక్ష నేత అయినా చంద్రబాబు అలవాటు.
అంతేకాదు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టి విమర్శలు గుప్పించడం చంద్రబాబుకి అలవాటుగా మారింది. ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ తయారయ్యారు. దాంతో ఈ ఇద్దరు నేతలు జగన్ ప్రభుత్వం మంచి చేసినా చెడుగా చిత్రీకరించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం ఇప్పటికే స్పష్టమయ్యింది. అయితే ఇదే వైఖరి ని మోడీ విషయంలో ఎందుకు చూపించట్లేదని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు..విపక్షం అంటే కేవలం ప్రశ్నించడానికి మాత్రమే కాదని, సమస్య పరిష్కారానికి మార్గాలు కూడా చూపాల్సిన అవసరం ఉందని ఈ ఇరువురు నేతలు గ్రహించాలి.రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన నిధులను కూడా విడుదల చేయకుండా, వరద సహాయం లో ఉదారంగా వ్యవహరించకుండా కేంద్రం నిర్లక్ష్యం చేసే విధానాన్ని ప్రశ్నించాలి.