గ్రేటర్ యుద్ధం : రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ

Chaganti
భారతీయ జనతా పార్టీ ముందు నుండీ అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. మొన్న దుబ్బాక ఎన్నికలో గెలిచి జోరుమీదన్న ఆ పార్టీ ఎలా అయినా ఇక్కడ కూడా తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేసి అందుకు సఫలం అయింది. ఒకరకంగా ఆ పారి ఫిక్స్ అయిన టార్గెట్ రీచ్ అయినట్టే కనిపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం తనకు ప్రధాన ప్రత్యర్థి అని ప్రచారం మొదలు కాక ముందు నుండీ చెప్పుకున్న బిజెపి ఇప్పుడు దగ్గర దగ్గరగా టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలకు చేరువ అయింది. ఇప్పటికే బీజేపీ 46 స్థానాలు సాధించింది. 
మరొక పక్క అధికార టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాలు సాధించగా ఎంఐఎం పార్టీ 42 స్థానాల్లో స్థిరంగా ఉంది. ఇక భారీ ఎత్తున సీట్లు లభించడంతో బిజెపి పార్టీ ఆఫీస్ వద్ద సంబరాలు జరుగుతున్నాయి. పార్టీకి సంబంధించిన అగ్ర నేతలు అందరూ ఒక్కరొక్కరుగా నాంపల్లిలో ఉన్న స్టేట్ మెయిన్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. ఇప్పటి దాకా టిఆర్ఎస్ భవన్ వద్ద నెలకొన్న కోలాహలం అంతా బీజేపీ ఆఫీస్ కి షిఫ్ట్ అయిందా అన్నట్టు ఉంది పరిస్థితి.  
ప్రస్తుతానికి ఆఫీస్ వద్దకు చేరుకున్న బండి సంజయ్ ని కార్యకర్తలు భుజాల మీద ఉరేగిస్తూ లోపలికి తీసుకు వెళ్లారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక ఇప్పటి వరకు 142 డివిజన్లో ఫలితాలు వెలువడగా అందులో యాభై ఆరు సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నలభై ఆరు సీట్లు బిజెపి కైవసం చేసుకుంది 42 స్థానాలకు ఎం ఐ ఎం పరిమితం అయింది. ఇక కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలు మాత్రమే ఫిక్స్ అయిపోయిందని చెప్పాలి. కేవలం మరో నాలుగు స్థానాలకు మాత్రమే ఫలితాలు వెలువడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: