గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ గెలుపు పై కే‌టి‌ఆర్ కీలక వ్యాఖ్యలు ..!!

KISHORE
జి‌హెచ్‌ఎం‌సి‌ ఎన్నికల‌ ఫలితాలు వెల్లడయ్యాయి.విడుదలైన ఫలితాలను ఏ పార్టీ కూడా ఊహించని రేతిలో గ్రేటర్ ప్రజలు తీర్పు చెప్పారు. పోటీలో ఉన్నఏ పార్టీకీ కూడా గ్రేటర్ ఓటర్లు స్పష్టమైన అధిక్యం కట్టబెట్టలేదు. మొత్తంగా 150 డివిజన్లు ఉన్న బల్దియాలో మేయర్ పీఠం దక్కాలంటే కనీసం 76 సీట్లు సాధించాలి. అయితే ఏ పార్టీ కూడా మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోలేకపోవడం గమనార్హం. అయితే ఈ ఎన్నికల్లో అందరి ధృష్టిని ఆకర్షించింది బి‌జే‌పి పార్టీ .
ఆపార్టీ అనుకున్నలక్ష్యాన్ని చేరుకోలేక పోయిన అధికార పార్టీకి గట్టి పొట్టి ఇచ్చింది.దీంతో టి‌ఆర్‌ఎస్ ధీటైన ప్రత్యర్థి గా తెలంగాణలో అవతరించే అవకాశం ఉంది.టి‌ఆర్‌ఎస్ మాత్రంఎన్నికల్లో గెలిచిన సంతోషంగా లేనట్టే కనిపిస్తుంది.  టి‌ఆర్‌ఎస్ 50కి పైగా డివిజన్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో నిలిచిపోయింది.
జీహెచ్ఎంసీ ఫలితాలపై స్పదించిన కే‌టి‌ఆర్ ఫలితాలు ఆశించిన విధంగా రాలేదన్నారు.“మరో 25 సీట్లు వస్తాయి అనుకున్నాము.12 సీట్లలో పదుల సంఖ్యలో టీఆరెస్ ఓడిపోయిందని . సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.. పార్టీలో పోస్ట్ మార్టం చేసుకుంటాం. మేయర్ పీఠం పై కూర్చునేందుకు రెండు నెలల సమయం ఉంది. పార్టీ ఆదేశాల మేరకు పనిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: