సీఎం జగన్ ను ట్రంప్ తో పోల్చిన అచ్చెన్న.. ఏమన్నాడో తెలుసా.?

praveen
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే.  గతంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా  వైరస్ వ్యాధి కారణంగా తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను... నిర్వహించాలని అటు ఎన్నికల సంఘం సూచిస్తున్నప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అది సాధ్యం కాదు అంటూ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం గా లేకపోవడం తో ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు పర్వం కొనసాగుతోంది.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది సీఎం జగన్ ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డోనాల్డ్ ట్రంప్ తో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు పోల్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన డోనాల్డ్ ట్రంప్ కి ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ కు ఎలాంటి తేడా లేకుండా పోయింది అంటూ అచ్చన్నాయుడు వ్యాఖ్యానించారు.  ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో జగన్ వణికిపోతున్నారు అని... స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా తీర్మానం చేయడం ట్రంప్  తరహా పోకడలకు నిదర్శనం అంటూ ఎద్దేవా చేశారు.



 అసెంబ్లీలో ఒక్కరోజు కూడా మాస్కు పెట్టుకోని సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు నిర్వహించము అంటూ  చెప్పడం సిగ్గుచేటు అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించగా లేని కరోనా కేవలం ఏపీ లోనే స్థానిక ఎన్నికలకు అడ్డువచ్చినదా  అంటూ ప్రశ్నించారు.  అప్రజాస్వామిక విధానాలతో జగన్ ముందుకు సాగుతున్నారు అంటూవిమర్శలు గుప్పించారు.   పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తుందని రైతుల తరపున పోరాడేందుకు టీడీపీఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: