ధోని 2.0.. నయా ఫినిషర్.. అభిమానులు ఫిదా..?

praveen
ప్రస్తుతం అసలు సిసలైన ఫినిషర్ కి కేరాఫ్ అడ్రస్ ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియాలో ఎన్నో మ్యాచ్ లలో  అసలు సిసలైన ఫినిషర్ గా అద్భుతమైన ప్రతిభతో ఎన్నో మ్యాచ్ లలో  విజయాలు అందించాడు మహేంద్రసింగ్ ధోని. కేవలం టీం  ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.  అయితే మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవలే ఆగస్టు 15వ తేదీన తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో  టీమిండియాకుధోని స్థాయిలో రాణించి అసలు సిసలైన ఫినిషర్ పాత్ర ఎవరు వహిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.



 ఈ క్రమంలోనే కె.ఎల్.రాహుల్ రవీంద్ర జడేజా హార్థిక్ పాండ్యా పేర్లు ఎక్కువగా చర్చలోకి వచ్చాయి.  అయితేగత కొన్ని రోజుల నుంచి మిడిలార్డర్ సమస్యతో బాధ పడుతున్న టీమిండియాకు ఇప్పుడు ఆ సమస్య తీరిపోయినట్లు  కనిపిస్తుంది.  ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయిన హార్దిక్ పాండ్యా మిడిలార్డర్లో అద్భుతంగా రాణిస్తూ మ్యాచ్ ఫినిషింగ్ ఇస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. భారత్ విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో... తానే పూర్తిగా బాధ్యత తీసుకొని అద్భుతమైన బౌండరీలు బాదుతూ జట్టుకు విజయాన్ని అందించాడు



 కేవలం సిక్సర్లు బౌండరీలు బాదాడమే  కాదు మరో వైపు పరుగుల మధ్య కూడా ఎంతో శరవేగంగా పరుగులు పెడుతున్నాడు హార్థిక్ పాండ్యా . ఎంత పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదు.  సాధారణంగా ధోని చివరి బంతి వరకు ఆడుతూ చివరిలో మ్యాచ్ ముగిస్తూ  అని అనుకుంటూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇటీవలే మ్యాచ్ అనంతరం కూడా హార్దిక్ పాండ్యా ఇదే చెప్పుకొచ్చాడు.. మ్యాచ్ ను సిక్స్ తోనే  ముగించాలని ముందే అనుకున్నా.. అందుకే చివరి బంతి వరకు మ్యాచ్  తీసుకెళ్లకూడదు నిర్ణయించుకున్నాను అంటూ వెల్లడించాడు. ఏదేమైనా ప్రస్తుతం హార్థిక్ పాండ్యా ధోని  2.0 అని అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: