వైసీపీ ఎంపీ ప్రజల కోసం సాధించాడు...గ్రేట్ సార్...!

VAMSI
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, విన్నూత పధకాలు మరియు కార్యక్రమాలతో ముందు దూసుకు వెళుతోంది. ప్రజలంతా వేసిన ఓటుకు సంతృప్తికరంగా ఉన్నారు. ఇకపోతే జగన్ నాయకులను ముందుకు నడిపించే తీరులో కూడా ముందున్నాడనే చెప్పాలి. తన నాయకత్వం లో ఎంతో మంది విద్యావంతులకు ఎమ్మెల్యే మరియు ఎంపీ సీట్లను ఇచ్చి ప్రోత్సహించారు. ఇప్పుడు వారంతా కూడా జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి వారి నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తున్నారు.

 ఇప్పుడు ఇదే రీతిలో మొట్ట మొదట సారిగా హిందుపూర్ ఎంపీ గా ఎన్నికైన గోరంట్ల మాధవ్ ప్రజలకు ఉపయోగపడే మంచి పనిని పూర్తి చేయడంలో సఫలీకృతుడయ్యాడు. ప్రజల అభివృద్ధికి కనీస వసతులు ఎలా అవసరమో... రవాణా సదుపాయాలు కూడా అంతే అవసరం. ఇదే తరహాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రత్యేక రైలు కోసం చేసిన కృషి నేటికి ఫలించింది. కదిరి–అనంతపురం–గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు నడవడానికి (ట్రైన్‌ నంబర్‌ –06340) దక్షిణ మధ్య రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ రైలు పట్టాలు ఎక్కేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ రైలు వెళ్లే మార్గాలను పరిశీలిస్తే...ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర వారాల్లో నాగర్‌ కోయిల్‌లో బయలుదేరనున్న ఈ ప్రత్యేక రైలు మదనపల్లె మీదుగా జిల్లాలోకి ప్రవేశించి కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణించి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌ చేరుకుంటుంది. ఇక అక్కడి నుండి మళ్లీ తిరిగి మంగళ, బుధ, గురు, ఆదివారాల్లో ముంబై ఛత్రపతి టెర్మినల్‌లో బయలుదేరి జిల్లా మీదుగా  ప్రయాణించనుంది. ఈ ప్రత్యేక రైలుకు అనుమతి లభించినందు వలన తమిళనాడు, చిత్తూరు, పూణే తదితర ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రయాణికులకు ఈ రైలు అందుబాటులో ఉండి వారికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంతాల ప్రజలు, నాయకులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: