గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?

praveen
రోజు రోజుకు వెలుగు లోకి వస్తున్న దారుణ ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేల  చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఒక దారుణ ఘటన గురించి మరవక ముందే మరో దారుణ ఘటన వెలుగు లోకి వస్తుందని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇంట్లో ఉన్న బయటకు వెళ్లిన కూడా కామాంధుల బారినపడి ఆడపిల్లలు బలి అవుతూనే ఉన్నారు. దీంతో రోజురోజుకీ ఆడపిల్లల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది.  క్షణం భయపడుతూ బతికే పరిస్థితి ఏర్పడింది.


 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆడ పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడంలేదు నిత్యం ఏదో ఒక చోట చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉండటం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది. వరంగల్ జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. కామాంధుల కోరల్లో చిక్కుకున్న బాలిక చివరికి పోరాడి మృత్యుఒడిలోకి చేరింది.  బాలికపై కొంతకాలం నుంచి లైంగిక దాడికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. బాలిక గర్భం దాల్చడంతో గర్భం పోయేలా ఒక అబార్షన్ టాబ్లెట్ ఇచ్చారు.

 ఆ ఇద్దరు యువకులు ఇచ్చిన అబార్షన్ మాత్ర వేసుకున్న బాలిక తీవ్ర రక్తస్రావం కావడంతో చివరికి ఆరోగ్యం  విషమించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది దగ్గొండి మండలం రేపల్లె లో చోటుచేసుకుంది. రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు బాలికను ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు చికిత్స అందించినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో చివరికి బాలిక ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు వదిలింది. ఇక బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరూ యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  గత నెలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: