మొత్తానికి దిగొచ్చిన కేంద్రం.. చర్చలకు రమ్మని రైతులకు పిలుపు..
ఈ మేరకు కేంద్రం దిగొచ్చింది.. నిరసనలు కొనసాగిస్తున్న రైతుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చర్చలకు పిలిచారు.. మంగళవారం సాయంత్రం 7గంటలకు రైతులు చర్చలకు రావాలని అమిత్‌షా తమను ఆహ్వానించారని.. రైతు సంఘాల నాయకుడు రాకేశ్ టికైట్ తాజాగా వెల్లడించారు.. మంత్రి అమిత్ షా తమను ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినట్లు రాకేశ్ చెప్పారు. ' చర్చలకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. 7 గంటలకు సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఢిల్లీ సమీపంలో జాతీయ రహదారులపై నిరసనలు కొనసాగిస్తున్న రైతులు సమావేశానికి హాజరు కానున్నారని రాకేశ్ తెలిపారు.
ఓ వైపు రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి రైతులను అత్యవసరంగా చర్చలకు ఆహ్వానించడం ఆసక్తిగా మారింది.. చర్చలు జరిపి రైతుల నిరసనలకు ముగింపు పలకాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 13 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐదో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో డిసెంబర్ 8న రైతు సంఘాలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో బంద్ ఇప్పటికీ కొనసాగుతోంది.. రైతుల కష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరూ బంద్ లో పాల్గొంటున్నారు..