జగన్ కి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సంచయిత గజపతి.
ఒకవైపు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌కు జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆ రైతు చట్టాలకు మద్దతు పలకుతూ ఆమె సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియ చేయడం విశేషం. ప్రతి మార్పు కూడా తొలుత తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందని, కానీ మంచి కోసమే ఆ మార్పు అని స్పందించారు. మార్పును మనం స్వాగతించాల్సిందేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లులు చరిత్రాత్మకమైనవని తెలిపారు. వ్యవసాయ రంగానికి ఈ సంస్కరణలు చాలా అవసరమని ఆమె తెలిపడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలవాల్సిన సమయం ఇదేనంటూ సోషల్ మీడియా వేదికగా సంచయిత గజపతి విజ్ఞప్తి చేయటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సపోర్ట్ తో మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ అయిన సంచయిత గజపతి.. తాజాగా మోదీ సర్కారుకు అనుకూలంగా మద్దతు తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఇంకా చాలా ఆసక్తికరంగా మారింది.ఇక ఈమె సోషల్ మీడియా స్పందన పై వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...