ఆరోసారి చర్చలు కూడా రైతులకు కలిసిరాలేదట.. అసలేమైంది ??

Satvika
ఢిల్లీలో రైతులు వ్యవసాయ చట్టానికి వ్యతిరేకిస్తూ గత 14 రోజుల నుంచి నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే.. పండించిన పంటకు కనీస మద్దతు ధరను కల్పించాలని ఢిల్లీ సరిహద్దులో చేపడుతున్న నిరసనలకు దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు మద్దతు తెలుపుతున్నారు. వారు చేస్తున్న పోరాటంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ మేరకు నిన్న రైతులు భారత్ బంద్ కు పిలుపు నిచ్చారు. న్యాయంగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.వాళ్లకు సపోర్ట్ చేస్తూ , కేంద్రం పై వ్యతిరేఖతను చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు తెలిపారు.



అందులో భాగంగా నిన్న భారత బంద్ ను నిర్వహించారు.. అయితే కొన్ని చోట్ల బంద్ చేస్తున్న నిరసన కారులు ఉద్రిక్తం చేశారు. మరి కొన్ని చోట్ల ఇప్పటికీ బంద్ కొనసాగుతోంది.. ఇకపోతే దేశంలో రైతుల కోసం నిరసనలు ఎక్కువ కావడంతో కేంద్రం రైతులతో చర్చలకు ఆహ్వానించారు..నిన్న సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతులతో చర్చలు జరిపారు..గతంలో జరిపిన ఐదు సార్లు చర్చలు ఫలించలేదు.. రైతులకు అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు జరిపిన ఆరోసారి చర్చలు కూడా రైతులకు సంతృప్తిని ఇవ్వలేదని తెలుస్తుంది..


 
ఈ సమావేశంలో చట్టాలకు సంబంధించి రాతపూర్వకంగా ప్రతిపాదనలు పంపిస్తామని అమిత్‌ షా చెప్పినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి... ఐతే కొత్తసాగు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా లేదని రైతు సంఘాల నేతలు తెలిపారు. కేంద్ర ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ప్రతిపాదనలు అందిన తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ వెల్లడించారు..ఇవాళ రైతు సంఘాలతో మరోవిడత చర్చలు జరుతామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. ఈ లోపే కేంద్ర హోం మంత్రి ఒక రోజు ముందుగానే రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. అవి కూడా వారికి ఊరటన కలిగించలేదు.. దీంతో మళ్లీ రైతులు రోడ్డెక్కారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: