స్టేట్ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్.. ఉచితంగానే అకౌంట్లోకి 25000..?
సరి కొత్త స్కీమ్ ప్రస్తుతం అందించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఇటీవలే ఎస్బిఐ కార్డు తీసుకొచ్చిన ఈ స్కీం ద్వారా ఎంతో సులభంగా కస్టమర్లు డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎస్బిఐ కార్డు రెఫర్ అండ్ ప్రోగ్రామ్ అందిస్తుంది... ఇక ఈ స్కీం కింద అమెజాన్లో వోచర్లు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ప్రతి ఏడాది దాదాపు 25 వేలకు పైగా వోచర్లను సొంతం చేసుకునేందుకు ప్రస్తుతం ప్రతి కస్టమర్కు అవకాశం ఉంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు మీ స్నేహితులు లేదంటే కుటుంబ సభ్యులను క్రెడిట్ కార్డు తీసుకునేలా చేస్తే సరిపోతుంది.
దీనికోసం ముందుగా మీరు ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇతరులను రిఫర్ చేయడం ద్వారా మీరు పాయింట్లు పొందుతూ ఉంటారు. మీరు ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు తీసుకోవడం ద్వారా మీకు 500 పాయింట్లు వస్తాయి. మీ రెఫరల్ కోడ్ ద్వారా ఎంతమంది ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు తీసుకుంటే అన్ని 500 వోచర్లు మీకు గరిష్టంగా లభిస్తాయి. ఇలా గరిష్ఠంగా ఏడాదిలో వోచర్ల ద్వారా 25000 పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక 60 రోజుల్లో మీ వోచర్ కు సంబంధించిన అమౌంట్ క్రెడిట్ కార్డు అకౌంట్ కు వచ్చి చేరుతుంది. ఇలాంటి అద్భుతమైన ఆఫర్ను ప్రస్తుతం తమ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది ఎస్బిఐ కార్డు.