వాక్సిన్ పై నిరాశ.. డోస్ తీసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్..?
అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఏదో ఒక విధంగా పంజా విసురుతూనే ఉంది ప్రాణాంతకమైన మహమ్మారి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ను నియంత్రించేందుకు వివిధ దేశాలలో పలు సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయి. ఇటీవల అమెరికాలోని ఫైజర్ సంస్థ రూపొందించినా వ్యాక్సిన్ శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ కూడా జరుపుకుంటుంది. క్లినికల్ ట్రయల్స్ లో ప్రస్తుతం సత్ఫలితాలు ఇవ్వడంతో అత్యవసర వినియోగానికి అమెరికా ప్రభుత్వం నుంచి కూడా అనుమతి పొందింది అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం అమెరికాకు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ కొన్ని చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ కూడా శరవేగంగా జరుపుకుంటున్న ఫైజర్ సంస్థకు చెందిన వ్యాక్సిన్ వేసుకున్న కొంతమంది వాలంటీర్లకు ఇటీవలే సైడ్ ఎఫెక్ట్స్ రావడం సంచలనంగా మారిపోయింది. దీంతో ఫైజర్ యొక్క ఫలితం కాస్త ప్రస్తుతం చిక్కుల్లో పడిపోయింది. యూకేలో పైజర్ సంస్థ యొక్క టీకా వేసుకున్న కొంతమంది వాలంటీర్లకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు గుర్తించారు జర్మనీలోని బయోన్టెక్ సంస్థ.. అమెరికాలోని పైజర్ సంస్థలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ను రూపొందించాయి. అయితే ప్రస్తుతం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అని తెలపడంతో ప్రస్తుతం ఆ వాలంటీర్లను పరిశీలిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.