శుభవార్త: అన్నింటికన్నా శక్తివంతమైన కరోనా వ్యాక్సిన్ ఇదే...?

VAMSI
కరోనా ప్రభంజనం కొన్ని దేశాలలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రష్యా దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను కనుగొన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాక్సిన్ ను సాక్ష్యాత్తు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెపై ప్రయోగించారు. ఫలితం ఎలా ఉన్నా, ఈ వ్యాక్సిన్ పై కొంతమంది శాస్త్రవేత్తలు మరియు వైద్యులు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే ఇటీవల రష్యా అధ్యక్షుడు ఓ సరికొత్త ప్రయోగానికి తెరలేపినట్లు తెలిసింది. కాగా బ్రిటన్ తయారుచేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను రెండు రోజుల క్రితం బ్రిటన్ రాజు మరియు రాణి లకు ఇచ్చిన సంగతి తెలిసినదే.
కాగా ఇది ఎంతవరకు పనిచేస్తుందో అనే అనుమానం వారిలో ఇంకా ఉంది. కాగా ఇప్పుడు బ్రిటన్ రష్యా తో కలిసి సరి కొత్త వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అసలు విషయానికి వస్తే రష్యా బ్రిటన్ దేశాలు విడి విడిగా తయారు చేసిన వ్యాక్సిన్లను కలిపి ఇప్పుడు ఒక శక్తివంతమైన వ్యాక్సిన్ గా తయారుచేయాలని భావిస్తున్నారు. దీనికి కారణం రెండు వ్యాక్సిన్లు కలిస్తే కరోనా ను ఎదుర్కొనే శక్తి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం రెండు వ్యాక్సిన్లను కలిపితే ఏర్పడే వ్యాక్సిన్ వలన రోగి శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుందట, అయితే ఇలా ఏర్పడిన వ్యాక్సిన్ ను కేవలం 18 సంవత్సరాలు పైబడిన వారికే ఇవ్వనున్నారు. అయితే ఎంతకాలం ప్రయోగాలు జరుపుతారు...ఎంత మందిపై జరుపుతారు అనే విషయాలపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు.
మరి ఈ కొత్త ప్రయోగం ఫలించి వీలైనంత తొందరగా వ్యాక్సిన్ వస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇండియా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉంది.  ఇది కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: