ఓడినా, గెలిచినా, నమ్మినా, నమ్మకున్నా టీ ఆర్ ఎస్ పార్టీ చెప్తే చేస్తుంది..?
వాస్తవానికి గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచినా సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రచారం సమయంలో ఈ రేంజ్ లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని బీజేపీ కూడా ఊహించదు.. ఎందుకంటే దుబ్బాక లో పార్టీ అభ్యర్థి ని చూసి సింపతీ తో ప్రజలు ఓట్లు వేశారు తప్పా తమని చూసి కాదని బీజేపీ కి తెలుసు.. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఫలితాలు విప్లవమని చెప్పాలి..
అయితే ఈ పరిణామంతో టీ ఆర్ ఎస్ పార్టీ సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది.. ప్రజలు గెలిపించినా నైతికంగా టీ ఆర్ ఎస్ పార్టీ ఓడినట్లే.. ఈ నేపథ్యంలో ఇస్తామన్న వరదసాయం ఇంకా ఇవ్వకపోవడం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఇప్పడు వాటి అమలుపై దృష్టి సారించింది ప్రభుత్వం. మేయర్ పీఠాన్ని అధిరోహించకముందే తొలి అడుగు మెదలెట్టింది. ఉచిత మంచి నీటి సరఫరా పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గృహ వినియోగదారులకు ఉచితంగా నెలకు 20వేల లీటర్ల మంచి నీటిని అందించేందుకు జలమండలి కసరత్తు ఆరంభించింది.