ప్రధానిని వదలని కరోనా.. ప్రాణాలు తీసేసింది..?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎన్ని  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా పంజా విసురుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అనే విషయం తెలిసిందే.  అయితే ఇప్పటికే ఎంతో మంది సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి వైరస్... ప్రస్తుతం శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రజాప్రతినిధుల ప్రాణాలను సైతం బలితీసుకుంటు  విలయ తాండవం చేస్తుంది.



 సామాన్యులు సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతున్న మహమ్మారి కరోనా  వైరస్ ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధుల ప్రాణాలను సైతం బలితీసుకుంది. కాగా ఇటీవలే మరో ప్రజా ప్రతినిధి ప్రాణాన్ని బలితీసుకుంది మహమ్మారి వైరస్. ఈ సారి ఏకంగా ఒక దేశ ప్రధాని  తీసేసింది. దక్షిణాఫ్రికాలోని ఎస్వాతీని దేశ ప్రధాని ఆంబ్రోస్ డ్లమినీ ( 52) కరోనా వైరస్ తో ఈరోజు తెల్లవారుజామున మృతిచెందారు. గత రెండు వారాల క్రితం కరోనా  వైరస్ బారిన పడిన ఆయన స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.



 ఈ క్రమంలోనే క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చివరికి తుది శ్వాస విడిచారు  ఆంబ్రోస్ డ్లమినీ. ఈ విషయాన్ని ఉపప్రధాని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అయితే ప్రధాని మృతి దేశానికి తీరని లోటు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక వ్యాపార వేత్త అయిన ఆంబ్రోస్ డ్లమినీ  రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2018లో దేశ ప్రధాని స్థాయికి ఎదిగి పదవిని చేపట్టారు తర్వాత తనదైన శైలిలో పాలన సాగిస్తూ ఎంతో ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇక కరోనా  వైరస్ బారిన పడిన ప్రధాని మృతి పై ఎంతో మంది స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా  ఈ మహమ్మారి వైరస్ ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులను బలితీసుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: