యోగి సర్కార్ కి భారీ షాక్.. సుప్రీం కోర్టు జరిమానా.. ఎందుకో తెలుసా..?
ఈ నేపథ్యం లో యూపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల పై అటు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. అయినా ఎక్కడ వెనక్కి తగ్గని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ నే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వా నికి దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది. యూపీ ప్రభుత్వా నికి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. 15 వేల రూపాయల జరిమానా విధించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశించి నప్పటికీ ఒక కేసు లో అప్పీలు ఆలస్యం గా దాఖలు చేయడం కారణం గానే ఈ జరిమానా విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఆపిల్ వెంటనే దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ దాదాపు 500 రోజుల ఆలస్యం చేసినందుకు గాను 15 వేల రూపాయల జరిమానా విధించిందిదేశ అత్యున్నత న్యాయ స్థానం. న్యాయ స్థానం యొక్క సమయాన్ని వృధా చేసినందుకు గాను ఈ జరిమానా చెల్లించాలని సూచించింది. ఇక ఇలా సమయం వృధా చేసిన వారికి సమయం విలువ తెలియాల నే ఈ జరిమానా విధించినట్లు చెప్పు కొచ్చింది సుప్రీం కోర్టు.