ఏపీకి శుభవార్త.. భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా వైరస్ కేసులు మళ్లీ చాలా తక్కువగా నమోదు అవ్వడం జరిగింది. అలాగే కరోనా మరణాలు సైతం చాలా వరకు తగ్గి పోయాయి. అలాగే  డిశ్చార్జిల సంఖ్య కూడా బాగానే  తగ్గిపోయింది. సోమవారం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా తగ్గాయట. ఈ క్రమంలో కరోనా వైరస్  కేసులు భారీగా తగ్గాయి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన రోజులో చూసుకున్నట్లయితే 44,935 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిందట. అందులో  305 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వటం జరిగింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,75,836కి చేరింది.

సోమవారం రోజున  541 మంది కరోనా వైరస్  బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,64,049 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4,728కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,08,75,925 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో తెలపటం జరిగింది .అలాగే కరోనా మరణాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి.

సోమవారం కరోనా మహమ్మారి బారిన పడి కేవలం ఇద్దరు మాత్రమే మరణించారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు కరోనా బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,059కు చేరింది.ఇక ఇలాంటి మరెన్నో కరోనా వైరస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని కరోనా అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: