ఫేస్ బుక్ లో ప్రేమ.. చాతి పై యువతి బొమ్మ.. కానీ చివరికి..?

praveen
నేటి యువత పై సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక రోజు రోజుకు సోషల్ మీడియా వాడకం పెరిగిపోతున్న నేపథ్యం లో సోషల్ మీడియా కారణంగా జరిగిపోతున్న దారుణాలు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా సోషల్ మీడియా వేదికగా పుట్టిన ప్రేమ ఎన్నో దారుణాల కు కారణం అవుతుంది. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఫేస్ బుక్ లో పుట్టిన ప్రేమ ఏకంగా ఒక యువకుడు ప్రాణాన్ని బలితీసుకుంది.


 ఫేస్బుక్లో పరిచయమైన యువతిని కొంతకాలం పాటు ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ యువతి మాత్రం పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు లోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే.. చిలకలగూడ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యాపారి కుమారుడు వంశీకృష్ణకు ఇటీవలే ఫేస్బుక్ లో  యువతితో పరిచయం ఏర్పడింది.  ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వంశీకృష్ణ ఫేస్బుక్ లో  పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు.



 ఇక యువతి ప్రేమలో మునిగిపోయిన వంశీకృష్ణ ఏకంగా యువతి ప్రేమకు గుర్తుగా తన ఛాతీపై ప్రియురాలి చిత్రాన్ని కూడా టాటూ వేయించుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి ప్రేమ కథ సాఫీగా సాగిపోయింది కానీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి పెళ్లి చేసుకుందామని యువకుడు కోరినప్పటికీ యువతి అంగీకరించలేదు దీంతో.. పలుమార్లు పెళ్లి చేసుకుందాం అని ఆ యువతిని కోరిన వంశీకృష్ణ.. చివరికి యువతి తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయాడు చివరికి మనస్తాపం చెంది.. రైల్వే ట్రాక్ పై  ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు దీంతో వంశీకృష్ణ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కంటనీరు పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: