జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ కి రామ్ రామ్....!

VAMSI
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మద్దతు పలికిన అగ్ర పార్టీకే బాయ్ చెప్పనున్నారట. రాజకీయంలో స్నేహం అన్నాక నాయకులు ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సి ఉంటుంది. నేను వారికీ చేశాను కానీ, నాకు ఏమీ తిరిగి రాలేదు అన్న ఆలోచనలో ఉన్నారట పవన్. ఇంతకీ విషయం ఏంటంటే..?? ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయపరంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. తన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా... ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇటు సినీ బ్యాక్ గ్రౌండ్, ఒక పార్టీని నడపడానికి కావలసిన వసతులు, అనర్గళంగా మాట్లాడగల సత్తా, తెలివి ఇలా రాజకీయ అధినేత ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నప్పటికీ... అవన్నీ వినియోగించుకొని పార్టీని అధికారంలో నిలబెట్టుకోలేక పోతున్నారు పవన్.

అండదండగా ఉంటుందని నమ్మిన బిజెపి... ఒట్టి చేతులు చూపిస్తుండడం, తన పార్టీలో దీటైన  రాజకీయ నేతల కొరత, ఇలా ఎన్నో కారణాలు పవన్ ను వెనక్కి లాగుతున్నాయి. బీజేపీ సహకారం ఉంటే ఖచ్చితంగా తమ పార్టీ జెండా అదే స్థానంలో రెపరెపలాడుతుంది అని భావించి నిరంతరం బీజేపీకి మద్దతు పలుకుతూ వచ్చారు పవన్. కానీ బీజేపీ నేతలు మాత్రం పవన్ కి రాజకీయంగా పెద్దగా సహకరించడం లేదనే చెప్పాలి. ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలపై జనసేన ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండగా,  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ ఎన్నికల్లో జనసేన వల్ల బలపడిన బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడం పై జనసేన  మండిపడుతోంది. తోడు నీడగా ఉండాల్సిన పార్టీ నే ఇలా తమ దారి తాము చూసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోందట.

దాంతో బీజేపీతో పొత్తు వదులుకొని... ఆ పార్టీకి దూరమయ్యే ఆలోచనలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టిడిపి అధినేత ఈ సందర్భాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే మంచి తరుణంగా భావిస్తున్న చంద్రన్న జనసేనకు సహకారాన్ని అందిస్తూ రానున్న ఎన్నికల్లో (2024) అధికార పీఠాన్ని సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన మద్దతు ఉంటే తిరిగి పార్టీని బలపరిచి అధికారంలోకి తీసుకు రావడం అంత కష్టమేమీ కాదు అన్న ఆలోచనలో ఉందట టిడిపి. కాకపోతే ఇందుకు పవన్ అంగీకరిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

దీనికి కారణాలు లేకపోలేదు... గతంలో 2019 ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.175 స్థానాలకు గాను వైసీపీ ఏకంగా 151 స్థానాలు గెలుపొందడం, టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఘోర పరాజయానికి కారణాలను వెతికితే రాజకీయంగా కనిపించిన ప్రధాన కారణం జనసేన పార్టీ అని అప్పట్లో ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు పవన్ ఒకవేళ బిజెపికి దూరమైతే టీడీపీకి దగ్గరవుతారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ 2024 ఎన్నికల లోపు జనసేన అధినేత పవన్ ను తమ వైపు తిప్పు కుంటే... తిరిగి అధికారంలోకి రావడం చాలా తేలిక అని భావిస్తోందట టిడిపి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: