ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణి డేట్ ఫిక్స్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...  ఆంధ్రప్రదేశ్  ప్రజలకు శుభవార్త అందించింది జగన్ ప్రభుత్వం.కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీకి ముహూర్తం షురూ అయ్యింది.ఆంధ్ర ప్రదేశ్ లో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ‘డిసెంబరు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది’అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.

కానీ మళ్ళీ  కొద్దిసేపటి తర్వాత సోషల్ మీడియా లో ఆ పోస్ట్ ని విజయ్ సాయి తొలగించారు.కేంద్ర ప్రభుత్వం  సూచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక కోసం జగన్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కమిటీలో మొత్తం 18 మంది సభ్యులు వుంటారు. 18 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కమిటీ కన్వీనర్‌గా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ప్రకటించడం జరిగింది.

ఇక ఈ కమిటీ కనీసం నెల రోజులకు ఒక్కసారి భేటీ కావాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో తెలపడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: