గాడిద పేడతో గరంమసాలా.. బయటపడిన నిజంతో పోలీసులు షాక్..?

praveen
ఒకప్పుడు వివిధ మూలికలతో మసాలా తయారు చేసుకునే వారు కానీ ప్రస్తుతం వంటకాల్లో  మసాలాలు కావాలి అంటే దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్లి కొనుక్కుంటున్నారు ప్రతి ఒక్కరు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో అసలు మసాలాలు  లేని వంటకాలు లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.  ప్రతి వంటకంలో కూడా గుమగుమలాడే మసాలాలతో వంటకానికి మరింత రుచి తెచ్చేలా ప్రస్తుతం ఎక్కువ మంది మసాలాలను వాడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మసాల వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో ఇక ఈ మసాలాలు కూడా ఎన్నో కల్తీ మసాలాలు వస్తూ ఎంతోమంది ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది అన్న విషయం తెలిసిందే.



 సాధారణ మసాలా వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో నకిలీ మసాలాలు తయారై చివరికి ప్రాణం మీదికి తెచ్చిన ఘటనలు కూడా ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే నకిలీ మసాలా తయారు చేస్తున్న ముఠాను గుర్తించి పోలీసులు అరెస్టు  చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల బయట పడిన ఘటన చూస్తే మరొకసారి మసాలా దగ్గరికి వెళ్ళాలి అంటే నే భయపడి లాంటి ఘటన బయటపడింది. సాధారణంగా ఈ మధ్య కాలంలో గరం మసాలా లు ఎక్కువగా వాడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఏ వంటకం లో అయినా  మసాలాలు ఎక్కువగా వాడుతున్నారు.



 ఇక ఈ మధ్య కాలంలో మసాలాలు ఎక్కువగా వాడటం పెరిగిపోయిన నేపథ్యంలో నకిలీ మసాలా తయారు చేసి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా గాడిద పేడ  ఉపయోగించి మసాలాలు తయారు చేస్తున్న ముఠాని పోలీసులు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్లోని నవీపూర్  ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని స్థానిక బ్రాండ్ల పేరుతో ఉన్న 300 కిలోల నకిలీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతేకాదు అక్కడ బయటపడిన వస్తువులు చూసి ఒక్కసారిగా షాకయ్యారు గాడిద పేడ, ఎండు గడ్డి తినలేని రంగులు యాసిడ్ సహ తదితర వస్తువులను కూడా సీజ్ చేశారు పోలీసులు. వీటితో కారం గరం మసాలా పసుపు లాంటివి తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: