టూలేట్ బోర్డు చూసి ఇంట్లోకి వచ్చిన వ్యక్తి.. చివరికి వృద్ధురాలు ఒక్కతే ఉండడంతో..?

praveen
ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు  చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని ఈ విధంగా నెలకొన్నాయి పరిస్థితులు.  పైకి మంచివారుగా కనిపిస్తూనే సరైన సమయం చూసి అసలు స్వరూపాన్ని బయటపెట్టి  చివరికి దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దొంగలు ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నారు. అంతే కాకుండా ఎంతో కొత్తగా ఆలోచిస్తూ ప్రజలను మభ్యపెడుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది... ఓ వృద్ధురాలు ఉంటున్న ఇంట్లో ఒక పోర్షన్  ఖాళీగా ఉండడంతో అద్దెకు ఇవ్వాలని భావించి టులెట్ బోర్డ్ పెట్టింది. బోర్డు చూసి ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు ఒక వృద్ధురాలు ఒక్కతే ఉంది అని గమనించారు ఇక లోపల ఇల్లు చూపించేందుకు వృద్ధురాలు తీసుకెళ్లడంతో అదే సరైన సమయంగా భావించి వృద్ధురాలు కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి చివరికి మెడలో ఉన్న బంగారంతో పాటు ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా దోచుకుపోయారు కేటుగాడు. పట్టపగలే దారుణమైన దోపిడీ జరిగిన ఘటన ఒంగోలులో వెలుగులోకి వచ్చింది.



 మారుతీ నగర్ 2వ లైన్ లో అనంత లక్ష్మి అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఉంది. కూతురు పెళ్లి ప్రస్తుతం దూరంగా ఉండగా భర్త కొన్నేళ్ళ క్రిందట మరణించాడు. దీంతో ఇంట్లో వృద్ధురాలు ఒక్కరే ఉన్నారు. ఇక తన ఇంట్లో ఒకపోర్షన్ ఖాళీ కావడంతో అద్దెకు ఇవ్వాలని భావించింది వృద్ధురాలు.  ఈ క్రమంలోనే వచ్చిన కేటుగాడు తాను బ్యాంకు ఉద్యోగి నని ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు... అతని మాటలు నమ్మిన వృద్ధురాలు అతనికి ఇల్లు చూపించేందుకు లోపలికి పిలిచింది దీంతో వెంటనే కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి..  సవర్ల బంగారు ఆబరణాలు ఐదు వేల నగదు దోచుకుని పరారయ్యారు కొద్దిసేపటికి..  పక్కింటి  వారు చూసి కట్లు విప్పడంతో వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: