సోషల్ మీడియాలో జగన్ కి షాకిచ్చి ఒపీనియన్ పోల్ పెట్టిన నారా లోకేష్....
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం, మూడు రాజధానులు, వరద సాయం, మిగిలిన అంశాలపై విన్నవించారు.. దాదాపు గంటసేపు ఈ భేటీ కొనసాగింది. బుధవారం ఉదయం కేంద్ర జలశక్షి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను జగన్ కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.. సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడంతో పాటూ పెండింగ్ నిధులు కూడా మంజూరు చేయాలని కోరారు. జగన్ ఢిల్లీ పర్యటనను లోకేష్ టార్గెట్ చేశారు.. ఓపీనియన్ పోల్ మొదలు పెట్టారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఈ విధంగా ఒక సంచలన పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై ఓపీనియన్ పోల్ మొదలు పెట్టడం జరిగింది. జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న రహస్యం ఈ కింది వాటిలో ఏది అంటూ మూడు ఆప్షన్లు ఇచ్చారు.
1) కేసుల మాఫీ కోసమా?..
2) బాబాయ్ హత్యకేసు కోసమా?..
3)ప్రత్యేకహోదా తేవడం కోసమా?
అంటూ ప్రశ్నించారు. వారం పాటూ ఈ ఓపీనియన్ పోల్ కొనసాగనుంది. ఇక నారా లోకేష్ పెట్టిన ఈ పోల్ పై పలువురు వైసీపీ అభిమానులు కోప్పడుతుండగా తెలుగుదేశం దేశం అభిమానులు అందుకు లోకేష్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫోలో అవ్వండి. ఇంకా మరెన్నో రాజకీయ విషయాలు గురించి తెలుసుకోండి..