పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?
కానీ పెళ్లి చేసుకొని నెల రోజులు కూడా తిరగకుండానే ఇద్దరు నవ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషాదకర ఘటన నిజాంబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న ప్రణీత్ విజయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన ప్రణీత్ విజయ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా ప్రణీత్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు కానీ విజయ తల్లి మాత్రం వీరి ప్రేమను అంగీకరించి వీరిద్దరికీ గుళ్లో పెళ్లి చేసింది.
ఇక తమ ప్రేమను అర్థం చేసుకుందని కొత్తజంట అనుకుని క్రమంలోనే ఇక అమ్మాయి తల్లి ఇంట్లోనే కాపురం పెట్టారు. కానీ కొన్ని రోజుల నుంచి అమ్మాయి తల్లి నుంచి ఇద్దరికీ వేధింపులు ఎక్కువ అవ్వడం మొదలయ్యాయ. ఇది తెలుసుకున్న అబ్బాయి తరపు తల్లిదండ్రులు వారిద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత విజయ తల్లి అక్కడికి వెళ్లి గొడవ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈ జంట ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తమ చావుకు కారణం తల్లే అంటూ విజయ సూసైడ్ నోట్ రాసి ఉంది. ఇక వీరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.