బ్రహ్మోస్ మిసైల్.. భారీగా ఇవ్వండి.. సిద్ధం అవుతున్న నేవీ.?
ఈ క్రమంలోనే భారత ఆర్మీలో ఎంతో వినూత్నమైన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను చేర్చడానికి భారత ఆర్మీ కి ఎక్కువ మొత్తంలో ప్రస్తుతం బడ్జెట్ కూడా కేటాయిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశి ఆయుధాల కొనుగోలుతో పాటు స్వదేశీ ఆయుధాలను కూడా భారత ఆర్మీలో చేరుస్తూ మరింత పటిష్టవంతం చేస్తుంది. ఇటీవలె త్రివిధ దళాలకు ఏ క్షణంలో యుద్ధం తలెత్తినా ఎదుర్కొనేందుకు కావలసిన అన్ని రకాల ఆయుధాల గురించి కేంద్రానికి తెలపాలి అంటూ కేంద్రం కోరింది. ఈ క్రమంలోనే నేవి కేంద్రం ముందు ఒక ప్రతిపాదన ఉంచింది.
ఇటీవలే భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మోస్ మిసైల్స్ తయారు చేసింది అనే విషయం తెలిసిందే. దాదాపు 450 కిలోమీటర్ల దూరం లో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఎంతో సమర్థవంతంగా చేదించేటువంటి బ్రహ్మోస్ మిస్సయిల్ ని ప్రస్తుతం ప్రతి యుద్ధనౌక లో 38 బ్రహ్మోస్ మిసైల్స్ నూ అమర్చే విధంగా నేవి కి నిధులు కేటాయించాలి అంటూ నేవి ఇటీవలే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది దీనికి అటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దీనికిగాను 1800 కోట్ల రూపాయలునిధులు అవసరమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.