వృద్ధురాలి నోటికి ప్లాస్టర్ వేసి దారుణానికి పాల్పడిన యువకులు.. చివరికి

Satvika
డబ్బు పిచ్చిలో యువత మోసాలకు పాల్పడుతున్నారు.. ఇప్పుడేమో ఏకంగా దారుణాలకు కూడా వెనకాడటం లేదు.. నేరాలు చేసేందుకు కూడా తగ్గడం లేదు.. ఇప్పుడు కరోనా దెబ్బతో డబ్బులు కోసం దొంగ తనాలు, దోపిడీలు చేస్తున్నారు.. ఇప్పుడు తాజాగా ఇద్దరు అద్దె ఇల్లు కోసం అని వెళ్లి దారుణానికి పాల్పడ్డారు..టు లెట్ బోర్డు చూసి అద్దెకు ఇల్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చారు. బ్యాంకు ఉద్యోగం చేస్తామంటూ ఇల్లు అద్దెకు అడిగారు. ఇంటి యజమానురాలు ఇల్లు చూపించేందుకు లోపలికి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా షాకిచ్చారు. ఆమె కాళ్లూచేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి తాపీగా చోరీ చేసి పారిపోయారు.



వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ఆంధ్ర ప్రదేశ్ ఒంగోలు లో వెలుగు చూసింది.మారుతీనగర్‌ రెండో లైన్‌లో కంచర్ల అనంతలక్ష్మి నివాసముంటోంది. ఆమె భర్త కొన్నేళ్ల కిందట మరణించాడు. కూతురు వివాహమై దూరంగా ఉంటోంది. తన ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉండడంతో అనంతలక్ష్మి టూ లెట్ బోర్డు పెట్టింది. అది గమనించిన కేటుగాడు అద్దెకు ఇల్లు కావాలంటూ లోపలికి వచ్చాడు. ప్రముఖ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. ఆ విషయం నమ్మించే ప్రయత్నం చేశారు. మాకు ఉండటానికి ఇల్లు కావాలి చూపించాలని అడిగారు. అది నిజమే అనుకొని ఆమె తలుపులు తెరచి చూపిస్తుండగా మరో వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు.



ఇద్దరూ కలసి ఆమెను అమాంతం లాక్కెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లూచేతులు కట్టేశారు. నోటికి ప్లాస్టర్ వేసి కేకలు వేయకుండా జాగ్రత్తపడ్డారు. ఆమె మెడలో ఉన్న 12 సవర్ల బంగారు ఆభరణాలు, బీరువాలో దాచి ఉంచిన రూ.5 వేల నగదు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత పక్కింటి వారు వచ్చి చూసి ఆమెను విడిపించారు. బాధితురాలు వెంటనే జరిగిన చోరిని పోలీసులకు తెలిపింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలో ఈ మధ్య ఇటువంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజలు ఇలాంటి వారిని అసలు నమ్మకండి.. ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే ఇంటిని చూపించండి అంటూ హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: