67 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.. మహిళకు మరణ శిక్ష..?

praveen
అమెరికా 67ఏళ్ళ  చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా జనవరి 12 వ తేదీన ఘటన జరగనుంది. ఏకంగా 67 ఏళ్ల అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓ మహిళకు ఆ దేశం ఉరిశిక్ష అమలు చేయనుంది.  సరిగ్గా డోనాల్డ్ ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే కొన్ని రోజులముందు అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్  ప్రమాణస్వీకారం చేపట్టే కొన్ని రోజుల ముందే ఈ ఘటన జరగనుండటం  గమనార్హం. ఇంతకీ చరిత్రలోనే మొదటిసారి ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడానికి గల కారణం ఏమిటి అనే సందేహం మీకు రావచ్చు. లీసా మౌంట్ గోమేరీ అనే మహిళా 2004 సంవత్సరంలో దారుణానికి ఒడిగట్టింది.



 అత్యంత పాశవికంగా గర్భవతిని హత్య చేసింది...  దారుణంగా హత్య చేయడమే కాదు కడుపులోని పేగులు కోసి ఏకంగా ఎనిమిది నెలల పసికందు ని బయటకు తీసింది.. పసికందు ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడినప్పటికీ చివరికి గర్భవతి మాత్రం మరణించింది. ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లీసా మౌంట్ గోమేరీ ని  అరెస్టు చేశారు.  ఇక ఆ తర్వాత 2004 నుంచి ఈ హత్యకు సంబంధించిన కేసు కోర్టులో విచారణ జరుపుతూవచ్చింది. ఈ క్రమంలోనే కోర్టు సదరు మహిళకు మరణ శిక్ష విధించింది.  కాగా జనవరి 8వ తేదీన సదరు మహిళకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్నప్పటికీ...  అటార్నీ లకు కరోనా  వైరస్ సోకడంతో జనవరి 12 కు ఆమె ఉరిశిక్ష వాయిదా వేశారు. కాగా 1953లో ఇలా అమెరికాలో ఒక మహిళకు ఉరిశిక్ష వేయబడింది.



 ఒక ఇప్పుడు దాదాపు 67 ఏళ్ల తర్వాత అమెరికా చరిత్రలో ఇలా రెండవసారి మహిళకు ఉరిశిక్ష అమలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే సదరు మహిళ యొక్క ఉరిశిక్షను ఆపాలి అంటూ వైట్హౌస్ ను డిమాండ్ చేస్తూ కొందరు న్యాయవాదులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఓవైపు సదరు మహిళ మానసిక శారీరక వ్యాధులతో బాధ పడుతుంది అంటూ కోర్టులను ఆశ్రయించారు ఆమె తరపు న్యాయవాది. ఒకవేళ కోర్టులు సదరు మహిళకు పడిన మరణశిక్షను వాయిదా వేస్తే ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చే అధ్యక్షుడు మరణశిక్ష పడిన ఖైదీల ను ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: