మలక్కా దగ్గర చైనాకి చెక్.. రూట్ మార్చిన డ్రాగన్ .?
భారతీయ సరిహద్దులు తలెత్తిన ఉద్రిక్తత పుణ్యమా అని అటు భారత్ అగ్రరాజ్యాల తో సత్సంబంధాలు ఎంతో మెరుగు పడ్డాయి. ఈ క్రమంలోనే విస్తరణ కాంక్షతో ప్రస్తుతం రగిలిపోతున్న చైనాకు ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు భారత్ సహా మిత్రదేశాలు అని ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. దక్షిణచైనా సముద్రం తమదేనంటూ చెప్పుకుంటున్న చైనాకి వరుసగా షాకులు ఇస్తున్నాయి అగ్రరాజ్యాలు. ప్రస్తుతం ప్రధానంగా మలక్కా జలసంధి దగ్గర సరుకుల రవాణా జరుగుతూ ఉంటుంది చైనాకి. ఇటీవల భారత్ ఏకంగా 1200 నౌకలతో మలక్క జలసంధిని పూర్తిగా బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కాస్తా ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.
మలక్కా జలసంధి పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది భారత్. అటు జపాన్ అమెరికా ఆస్ట్రేలియా కు చెందిన యుద్ధ నౌకలు కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండటం ప్రస్తుతం చైనా కు భారీ షాక్ తగిలిందని చెప్పాలి. ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రస్తుతం చైనాకు చెక్ పెట్టే విధంగా మలక్క జలసంది దగ్గర ఉన్నటువంటిభారత యుద్ధనౌకలు కు తోడుగా.. అమెరికా ఆస్ట్రేలియా జపాన్ లాంటి దేశాలు కూడా తమ యుద్ధ నౌకలను మోహరిస్తున్న క్రమంలోనే మలక్కా జలసంధి కాస్త పూర్తిగా బ్లాక్ అవుతుంది.అయితే ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన చైనా ముందస్తు జాగ్రత్తలో భాగంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పోర్టుకు వెళ్లేందుకు సిపెక్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంది చైనా.