బాబు మళ్లీ సీఎం అయ్యి ఉంటే...?
గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన బిజెపి, ప్రస్తుతం మాత్రం అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటూ కొత్త పల్లవి అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి జగన్, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీల అధిపతులు, సీఎం లు, ప్రతిపక్ష నేతలు ఇలా అంతా రాయలసీమను ముంచేశారని, సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. అలాగే చంద్రబాబు పాలనలో జనం పెనం మీద ఉంటే, జగన్ పరిపాలనలో పొయ్యిలో పడ్డారని సెటైర్ వేశారు.
ఏపీలో టీడీపీ వైసీపీ శకం ముగిసిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొరపాటున టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే, ప్రజలు మూడు రాజధానులు అడిగేవారు అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. బిజెపి డిక్లరేషన్ గురించి ద్రోహులైన బాబు , జగన్ కు మాట్లాడేందుకు అర్హత లేదని, బిజెపి డిక్లరేషన్ వల్లే జగన్ కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు అనే విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.