జేసీ వైఖరి చంద్రబాబు కు ప్లస్ అవుతుందా..మైనస్ అవుతుందా..?

P.Nishanth Kumar
రాయలసీమ లో రాజకీయాలకు జేసీ బ్రదర్స్ కేరాఫ్ అడ్రస్.. టీడీపీ లో ఉంటూ రాజకీయాల్లో ఈ కుటుంబం వేసిన ఈ ముద్ర అంతా ఇంత కాదు..ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి హాట్ హాట్ రాజకీయాలకు పెట్టింది పేరు. అయితే ఇంతవరకు ఆయనకు రాజకీయాల్లో ఆయనకు ప్రముఖ స్థానం అయితే లభించలేదు. చంద్రబాబు తో పాటే రాజకీయాల్లో అరంగేట్రం చేసినా ఇప్పటిదాకా సెకండ్ గ్రేడ్ లీడర్ గానే అయన కొనసాగుతూ వస్తున్నారు.. అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకుంటూ తన పరువును తానే తీసుకుంటూ ఉంటారు.

దాంతో ఆయనపై సొంత పార్టీ నేతలే విరక్తి సుపుతుంటారు. రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ నుండి ఫ్యామిలీ మొత్తం టీడీపీ లో వచ్చినా ఆయనకు ప్రముఖ స్థానం అయితే దక్కలేదు. అయితే ఏ పార్టీ లోకెళ్ళిన జేసీ ఎన్ని ఎందుకు ఖాతరు చేయరు అంటే అయన నోటికి తాళం వేయకపోవడమే అంటున్నారు. సొంత పార్టీ నేతలనే విమర్శించినా ఘనత జేసీ కి ఉంది.. ఇక టీడీపీ ఓటమి తరువాత పెద్ద గా అయన వాయిస్ వినపడకపోయిన జగన్ ని విమర్శించడంలో మిగితా టీడీపీ నాయకులకన్నా ఒక ఆకు ఎక్కవుగా చదివారు. అందుకే అయన వైసీపీ కి టార్గెట్ అయ్యారు. మనశ్శాంతి అన్నది కూడా లేకుండా పోయింది. తెల్లారిలేస్తే మీడియా ముందుకొచ్చి అయిన దాన్ని కానిదాన్ని ముడిపెట్టి సెటైర్లు వేసే జేసీ దివాకరరెడ్డి నోరు ఈ మధ్య పూర్తిగా మూగపోయింది.

అయితే అందుకు కారణం అయన టీడీపీ నుంచి బీజేపీ లోకి వెళ్లడమే అంటున్నారు. జగన్ దెబ్బకు తట్టుకోలేకనే జేసీ దివాకర్ రెడ్డి ఇలా పాత మాటలను గట్టు మీద పెట్టి మరీ కమల కరచాలనం చేస్తున్నారు అంటున్నారు.చంద్రబాబుకు నోరున్న, పేరున్న నేత సీమ జిల్లాల్లో చూస్తే జేసీ దివాకర్ రెడ్డి ఒక్కరే. ఆయన బోల్డ్ గా మాట్లాడినట్లు కనిపించినా తాను అనుకున్నదే మాట్లాడుతారు. చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారు అని ఇప్పటిదాకా ధైర్యం చెప్పిన జేసీయే ఇపుడు పలాయనవాదంతో బీజేపీ నీడన చేరితే టీడీపీ కధ రాయలసీమలో కంచికి చేరినట్లేనని అంటున్నారు. మరి జేసీ దివాకర్ రెడ్డి అవసరం టీడీపీ కి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: