కేసీఆర్ ని నమ్ముకుంటే లాభం లేదు.. రంగంలోకి దిగిన కేటీఆర్..
కట్ చేస్తే.. ఇలాంటి వ్యవహారాలన్నిటికీ చెక్ పెట్టాలనుకుంటున్నారు కేటీఆర్. హామీల అమలుపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. ఇటీవల కేసీఆర్ మరో దఫా తెలంగాణ యువతకు ఉద్యోగాల హామీ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ ఫాలోఅప్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికలు వంటివి వచ్చినా కూడా కోడ్ అడ్డంకి లేకుండా ఉద్యోగ నియామక ప్రక్రియ సజావుగా సాగేలా కేటీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వాసులకు ఉచిత తాగునీరు అందించే కార్యక్రమాన్ని కూడా కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. 2021 జనవరి నుంచి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకు రాబోతున్నట్టు ప్రకటించారు.
కొత్త ఏడాదికి ముందే హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జనవరి తొలి వారం నుంచే ఉచిత నీటి సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేయబోతున్నట్టు తెలిపారు కేటీఆర్. రెండు రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డిసెంబరు నెల నుంచే 20 వేల లీటర్ల వరకు తాగు నీటి వినియోగానికి ఎలాంటి రుసుము తీసుకోబోమని, ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబరు బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఉచిత తాగునీటి హామీతోపాటు.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు.