చంద్రబాబు కన్నా.. బ్రిటీష్‌ వారే నయం...!

VAMSI
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయ పాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరి రక్షణ సమితి ఆధ్వర్యంలో తమకు న్యాయం జరగాలంటూ రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం నాటికి 82 వ రోజుకు చేరుకున్నాయి. బహుజన పరి రక్షణ సమితికి చెందిన దళిత నాయకులు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. కాగా, వీరి యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరియు అభ్యర్థన ఏమిటంటే తాళ్లాయ పాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌ నుంచి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు, పాలనా వికేంద్రీకరణ, పేదలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్య కోరుతూ 56 దళిత సంఘాలు శనివారం ర్యాలీ నిర్వహించాయి.

కటిక పేదరికంలో అల్లాడుతూ తమ బిడ్డలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివించాలని ఉన్నా స్తోమత లేక బాధ పడుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వమే ఒక చక్కటి మార్గం చూపించాలని కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహించారు. జగన్ అన్న తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదనకు రూప కల్పన చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఎందుకు చంద్రబాబు అడ్డు పీఠం వేస్తున్నారు అంటూ... దూరదృష్టి లేని చంద్రన్న పేదల జీవితాలకు ఎలా దోహద పడతాడు అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇకనైనా ఆయన ఆలోచనలు మెరుగవ్వాలి అని...చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించి దళితులకు అడ్డు పడకుండా ఉండాలని కోరుతూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బహుజన పరి రక్షణ సమితికి చెందిన దళిత నాయకులు. బహుజన పరి రక్షణ సమితి సంఘాల నాయకులు బేతపూడి సాంబయ్య, మల్లవరపు సుధారాణి, కిషోర్, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఏదేమైనా పేద ప్రజల బంగారు భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళతామని.... ఆశయం నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు చంద్రబాబు కంటే నయమని వీరు ప్రస్తావించడం కొసమెరుపు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: