తూ.గో జిల్లాలో దారుణం.. చీటీ డబ్బులు వివాదం.. చివరికి..?
రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎవరిని కదిలిస్తే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయాందోళన లోనే బతుకు ను వెళ్ళదీయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది ఇలా సాటి మనిషి ప్రాణాలను కిరాతకంగా తీసేస్తూ చివరికి జైలుపాలు అవుతున్నారు ఇక ఇటీవల ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. చీటీ డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం ఏకంగా ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకుని హత్య యత్నం చేసేంతవరకు దారితీసింది తూర్పుగోదావరి జిల్లాలో.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల లో చీటీల డబ్బు వివాదం గా మారిపోయింది. చీటీ ల డబ్బులు అడిగారు అన్న కారణంతో ఏకంగా వాలంటీర్ కత్తితో అన్నదమ్ముల పై దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చిన వాలంటీర్ అన్నదమ్ముల పై విచక్షణ రహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ముగ్గురు అన్నదమ్ములు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కత్తితో దాడి చేసిన వాలంటీర్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.